ETV Bharat / state

గుంతల్లో చేపలు పడుతూ కాంగ్రెస్​ శ్రేణుల నిరసన

author img

By

Published : Jun 22, 2020, 9:29 AM IST

సూర్యాపేట జిల్లాలో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని కాంగ్రెస్​ నాయకులు గుంతల్లో గాలాలు వేసి చేపలు పడుతూ నిరసన తెలిపారు. వానాకాలంలో గుంతల్లో నీరు చేరితే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతూ అధికారులు వెంటనే స్పందించాలని హస్తం నేతలు అధికారులను కోరారు.

congress protest on burying potholes on roads at suryapet district
గుంతల్లో చేపలు పడుతూ కాంగ్రెస్​ శ్రేణుల నిరసన

సూర్యాపేట జిల్లా కోదాడ- మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న ప్రమాదకరమైన గుంతలను పూడ్చాలని కాంగ్రెస్​ పార్టీ నాయకులు డిమాండ్​ చేశారు. స్థానిక శాంతి స్థూపం వద్ద గుంతల్లో గాలాలు వేసి చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు వాటర్​ పైప్​లైన్​ వేస్తే శాశ్వత పరిష్కారమవుతుందని.. అలా కాకుండా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని కాంగ్రెస్​ జిల్లా నాయకులు అజీజ్​ పాషా అన్నారు. ఈ గుంతల వద్ద పాదచారులకు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రస్తుతం వానాకాలం ప్రారంభమైనందున.. పైపులైన్ల వాటర్​ లీకేజీతో పాటు వర్షపు నీరు కూడా గుంతల్లో చేరి తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశముందని కాంగ్రెస్​ శ్రేణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణాభివృద్ధి నిధులతో పాటు నూతనంగా వచ్చిన బడ్జెట్​ నిధులను వాడి పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు.

ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.