ETV Bharat / state

నేడు ప్రచారంలోకి దిగనున్న ముఖ్యమంత్రి - హుజూర్​నగర్​ ఉప ఎన్నిక

నేడు హుజూర్​నగర్​ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్​ ప్రచారం మొదలు కానుంది. మధ్యాహ్నం నియోజకవర్గానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఖరారుతో అధికారులు అన్ని రకాల ఎర్పాట్లు చేశారు.

నేడు ప్రచారంలోకి దిగనున్న ముఖ్యమంత్రి
author img

By

Published : Oct 17, 2019, 5:42 AM IST

Updated : Oct 17, 2019, 8:10 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ హుజూర్ నగర్​లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత నియోజకవర్గ కేంద్రానికి చేరుకోనున్న సీఎం.. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత సీఎం పర్యటన ఖరారు కావడం వల్ల ఆగమేఘాల మీద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. భారీ సంఖ్యలో బలగాల్ని మోహరించారు. ఎన్నికల వ్యయ పరిమితి మించిపోతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాక నిర్ణయాన్ని చివరి నిమిషం వరకు తేల్చలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్వయంగా కేసీఆర్​ జిల్లా నేతలకు సమాచారం అందించడం వల్ల అప్పటికప్పుడు ఏర్పాట్లపై దృష్టిసారించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్, నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

File : TG_Hyd_05_17_CM_Panchayatraj_AV_3053262 From : Raghu Vardhan ( ) గ్రామపంచాయతీల తరహాలోనే మండల, జిల్లా పరిషత్ లకు కూడా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ సభ్యుడిగా నియామకమైన గటిక అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అజయ్ కుమార్ అభినందనలు సీఎం... రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. గ్రామాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీల తరహాలోనే మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు కూడా నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మారుస్తామని... త్వరలోనే ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతి నెలా 339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని... అలాగే మండల, జిల్లా పరిషత్ లకు కూడా నిధులు విడుదల చేస్తామని అన్నాకు. తెలంగాణ పల్లెలు దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజల విస్తృత భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో పల్లెలు బాగు పడాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన ఆర్థిక ప్రేరణను ప్రభుత్వం అందిస్తుందని, మంచి విధానం తీసుకొస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలు సమైక్యంగా ఉండి నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను బాగు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
Last Updated : Oct 17, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.