ETV Bharat / state

BTech Student Committed Suicide : ఉద్యోగం పేరిట మోసం.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య - ఒత్తిడికి గురై బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

BTech Student Committed Suicide because Cheating Job Issue : ఉద్యోగాల పేరిట యువతీ, యువకులు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ.. కొందరు పలికిన మాయమాటలకు అమాయకులెందరో బలైపోతున్నారు. జాబ్ పేరిట పైసలు గుంజుతూ టోకరా వేస్తున్నారు. అటువంటి ఉచ్చులో పడిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది.

Young Woman Commits Suicide in Suryapet
BTech Student Committed Suicide because Cheating Job Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 4:56 PM IST

BTech Student Committed Suicide because Cheating Job Issue : వివిధ ఉద్యోగాల పేరిట యువతీ, యువకులు తరచూ మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ.. మాయమాటలు చెప్పి కొందరు మధ్యవర్తులు(Intermediaries) వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి వలలో పడి ఓ యువతి మోసపోయి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

ఇంతకీ ఏమి జరిగిందంటే..: విద్యార్థిని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడేనికి చెందిన కర్లపూడి సుబ్బారావు రెండో కుమార్తె కర్లపూడి మౌనిక(22) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మౌనిక కోదాడలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో(Engineering College) బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఇటీవల ఆమెను నమ్మించారు. జాబ్ కావాలంటే రూ. 28 వేలు కట్టమని నమ్మబలికారు.

Telangana Student Committed Suicide in IIT Kharagpur : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

వారిమీద నమ్మకంతో తనదగ్గర సరిపడా డబ్బులు లేకున్నా.. స్నేహితురాలి దగ్గర అప్పుగా తీసుకుంది. అవికూడా ఆన్‌లైన్‌లో స్నేహితుల కుటుంబ సభ్యుల డెబిట్‌ కార్డు(Debit Card) ద్వారా చెల్లించినట్లు స్నేహితులు వివరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్న వ్యక్తుల నుంచి ఏవిధమైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో డబ్బులిచ్చిన స్నేహితులకు సొమ్మును చెల్లించడంలో సమాధానం చెప్పలేక ఆమె మానసిక ఒత్తిడికి కొంత లోనైంది.

Student Committed to Suicide under mental stress : అప్పటికే కొంత మొత్తం చెల్లించింది. అయినా.. ఒత్తిడి రావడంతో పాటు కళాశాల హెచ్‌ఓడీ ఒకరు ఈ డబ్బుల విషయంలో జోక్యం చేసుకుని స్నేహితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి వెంటనే ఇవ్వాలన్నారు. లేకపోతే పరీక్ష హాల్‌ టికెట్‌ ఇవ్వమని హెచ్చరించారు. దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురైంది.

students crying headmistress suspension : ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్​.. వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు.. అప్పటివరకు స్కూల్​కు వెళ్లమని..

ఈ నేపథ్యంలోనే దసరా సెలవులు ప్రకటించడంతో.. మౌనిక ఈ మధ్యనే ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. తన సమస్య ఎవరికి చెప్పలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. ఇరుగుపొరుగు వారు(Neighbors) గమనించి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న స్నేహితులు కొత్తగూడెంలోని మృతురాలి ఇంటివద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు.

Young Woman Commits Suicide in Suryapet : స్నేహితురాలి మృతికి జాబ్‌ ఇప్పిస్తామని మోసం చేసిన వారు.. డబ్బులిచ్చి ఒత్తిడి చేసిన వారు.. హెచ్‌వోడీనే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఓడీ ఇక్కడికొచ్చి ఆమె కుటుంబానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి ఇంటివద్దకు చేరి పరిస్థితిని సమీక్షించారు. ఎవరి నిర్వాకమో గానీ తమ కూతురు నిండు ప్రాణాల్ని బలితీసుకుందని తల్లిదండ్రులు(Parents) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నందున ఫిర్యాదు ఇవ్వాలని మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు కోరగా.. వారు ఇవ్వమని చెప్పినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు.

Pravalika Suicide Accused Shivaram Arrest : ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.