సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా పలువురు గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో భాజపా బృందం గుర్రంపోడుతండాకు బయలుదేరింది.
సంజయ్‌తో పాటు కమలం నేతలు విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్, జితేందర్‌రెడ్డి, విజయరామారావు, రవీంద్రనాయక్, స్వామిగౌడ్ ర్యాలీగా వెళ్లారు. గిరిజనుల భూములను పరిశీలించిన భాజపా బృందం... గిరిజనుల ఆందోళనపై వారితో మాట్లాడింది. బాధితులకు అండగా ఉండి న్యాయం చేస్తామని కాషాయ నేతలు హామీ ఇచ్చారు.