కాంగ్రెస్ హయాంలోనే హుజూర్నగర్ సస్యశ్యామలంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి , శ్రీధర్ బాబు తదితరులు ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే నాగార్జునసాగర్ నిర్మించబడిందని.. దానివల్లే హుజూర్నగర్ నలుమూలల పచ్చని పైర్లతో కళకళలాడుతూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సైదిరెడ్డి గెలిస్తే నియోజకవర్గాన్ని అమ్మటం ఖాయమని ఎద్దేవా చేసారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పది రోజులు దాటుతున్న కేసీఆర్ నుంచి కార్మికులకు ఎలాంటి హామీలు లేవని మండిపడ్డారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఈ నెల21న ఛలో ప్రగతి భవన్: రేవంత్ రెడ్డి