సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలో వాహన దారులందరూ నూతన వాహన చట్టాన్ని కచ్చితంగా పాటించాలని సీఐ శ్రీనివాస్, ఎస్సై లింగం ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనదారులు సరైన ధృవ పత్రాలను, డ్రైవింగ్ లైసెన్సు ఉంచుకోవాలని, ద్విచక్ర వాహన దారులు విధిగా శిరస్త్రాణంను ధరించాలని చెప్పారు. కారు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్‌ను వినియోగించుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు