సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి నుంచి రూ.1.60 లక్షల విలువ గల 15 క్వింటాళ్ల బాయిలర్ కోళ్లతో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం అర్ధరాత్రి వాహనం బయల్దేరింది. నశీంపేట శివారు చివ్వెంల - ముకుందాపురం రహదారిపై లోలెవల్ కల్వర్టుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహన క్యాబిన్‌లో డ్రైవర్, మరోవ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం ఉదయం క్రేన్ సహాయంతో కోళ్ల వాహనాన్ని బయటకు తీశారు. అందులోని కొన్ని కోళ్లు మృత్యువాతపడ్డాయి.
![a bolero van carrying chickens overturns in near nashimpet suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-25-16-varadha-udhrithi-van-palti-photo-ts10066_17082020005332_1708f_1597605812_969.jpg)
నశీంపేట గ్రామస్థులు తమకు దొరికినకాడికి కోళ్లను ఎత్తుకెళ్లడానికి పోటీపడ్డారు. సూర్యాపేట గ్రామీణ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై బాలునాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోలెవల్ కల్వర్టు స్థానంలో బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశం