ETV Bharat / state

పురుగుల మందు తాగిన చిన్నారుల పరిస్థితి విషమం - CHILDRENS

అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు... ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ వెళ్లి పురుగుల మందని తెలియక నీళ్లలో కలుపుకొని తాగేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారు.

'పురుగుల మందని తెలియక నీళ్లలో కలుపుకొని తాగేశారు'
author img

By

Published : Jun 12, 2019, 11:17 AM IST

Updated : Jun 12, 2019, 12:37 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రఫీ, షకీరా దంపతులకు ఫర్జానా, ఆస్మా ఇద్దరు కుమార్తెలు. వీరి పక్కింట్లోనే ఉంటున్న బాబు అంజలిల కూతురు అక్షిత... ఈ ముగ్గురు చిన్నారుల కలిసి ఇంటికి దగ్గర్లోనే ఆడుకుంటున్నారు. వారికి పొదల్లో ఓ ప్యాకెట్ దొరికింది. అదేంటో తినేదనుకుని నీళ్లలో కలుపుకొని ముగ్గురూ తాగేశారు. తర్వాత ఇంటికొచ్చి భోజనం కూడా చేశారు. తర్వాత కాసేపట్లోనే ముగ్గురి నోట్లోంచి నురగలు రావడం గమనించారు కుటుంబ సభ్యులు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యమైనందున ఖమ్మంకి తీసుకెళ్లడం మంచిదని వైద్యులు సూచించారు. ఇందులో ఫర్జానా, అక్షితల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు ఏమైపోతారోనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

'పురుగుల మందని తెలియక నీళ్లలో కలుపుకొని తాగేశారు'

ఇవీ చూడండి: ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

పురుగుల మందు అని తెలవక తాగిన చిన్నారులు పరిస్థితి విషమం అభం శుభం తెలియని చిన్నారులు ఆడుకుంటూ ఇంటి దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో క్రిమిసంహారక మందు దొరకటంతో అది ఏంటో తెలియక పాకెట్ను ఓపెన్ చేసి నీళ్ళలో కలుపుకొని తాగారు క్రిమిసంహారక మందు వారి పాలిట శాపంగా మారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వివరాల్లోకెళితే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నాయ నగర్లో నివాసముంటున్న రఫీ మరియు షకీరా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఫర్జానా9 హస్మా7 ఉన్నారు. వీరి ఇంటి పక్కన బాబు మరియు అంజలి దంపతులకు అక్షిత కుమార్తె ఉంది. ఫర్జానా,హాస్మా,అక్షిత ముగ్గురు ఆడుకుంటూ వారికి దొరికిన క్రిమిసంహారక మందు ఏంటో తెలియక ఓపెన్ చేసి నీళ్ళలో కలుపుకొని తాగారు తాగిన గంటసేపటి తర్వాత అన్నం కూడా తిన్నారు.. అన్నం తింటున్న సమయంలో ఒకరి తరువాత ఒకరికి నోటి నుంచి నురగలు రావడంతో ఏంటో పాలుపోని బాబు ముగ్గురిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికే పరిస్థితి చేజారి పోవడంతో వారిని ఖమ్మంకి తరలించారు.. ఇందులో ఫర్జానా,అక్షిత ల పరిస్థితి విషమంగా ఉంది.. కూలినాలి చేసుకునే బతికే వీళ్ళ కుటుంబాలు పిల్లలు చేజారిపోతారో నని తల్లిదండ్రులు భయబ్రాంతులు అవుతున్నారు కెమెరా అండ్ రిపోర్టింగ్,::::వాసు సెంటర్:::కోదాడ ఫోన్ నెంబర్:::9502802407
Last Updated : Jun 12, 2019, 12:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.