ఊరి కోసం ఏమైనా చేయాలనే తపన ఆ యువకుడిని కదిలించింది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. తొగుట మండలం గణపురం గ్రామానికి చెందిన రామస్వామి.. ఆ గ్రామంలోని 400 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాడు. ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతగా పేదలకు తోచినంత సహాయం చేయాలని కోరాడు.
ఇదీ చదవండి: నిలిచిపోయిన పనులు.. అవస్థల్లో 21 లక్షల చేతి వృత్తుల కుటుంబాలు