సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయు, ఏఐటీయుసీ యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచే యోచనలో ప్రభుత్వం...!