ETV Bharat / state

mallanna sagar: శరవేగంగా నీటిశుద్ధి కేంద్రం నిర్మాణం.. ఐదు జిల్లాలకు ప్రయోజనం - mallanna sagar updates

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్‌ గరిష్ఠస్థాయిలో తన సేవలందించనుంది. కొండపాక మండలం మంగోలు గ్రామం వద్ద ప్రాజెక్టు లోపల ఇన్‌టేక్‌ వెల్‌, వెలుపల నీటి శుద్ధి కేంద్రం, పైపులైన్​ నిర్మాణాలకు రూ.1212 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం అనుమతించి జీవో విడుదల చేసింది. ఈ క్రమంలో మంగోలులో 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు కేంద్ర నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. రానున్న 8 నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది.

mallanna sagar
mallanna sagar
author img

By

Published : Aug 26, 2021, 12:24 PM IST

పల్లెలు, పట్టణాలకు మిషన్‌ భగీరథ పేరిట సాగుతున్న తాగునీటి సరఫరాకు సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్‌ జలాశయం గరిష్ఠస్థాయిలో తన సేవలందించనుంది. ఈ క్రమంలో 50 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం నుంచి ఐదు జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాలతోబాటు హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలకు తాగునీరందించేందుకు శాశ్వత ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోలు గ్రామం వద్ద ప్రాజెక్టు లోపల ఇన్‌టేక్‌ వెల్‌, వెలుపల నీటి శుద్ధి కేంద్రం, పైపులైను నిర్మాణాలకు రూ.1212 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం అనుమతించి జీవో విడుదల చేసింది. ఈ క్రమంలో మంగోలులో 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి (వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు) కేంద్ర నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. రానున్న 8 నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే జలాశయం వద్ద ఇన్‌టేక్‌ వెల్‌ పనులు పూర్తవగా మిగిలినవి శరవేగంగా సాగుతున్నాయి.

ప్రస్తుతం ఫేజ్‌-1 పథకం ద్వారా ఎల్లంపల్లి నుంచి జలాలను చిన్నకోడూరు మండలం మల్లారం నీటి శుద్ధికేంద్రానికి చేర్చి అక్కడ శుద్ధి చేసిన తరువాత కొండపాకలోని పంప్‌హౌస్‌కు, అనంతరం శామీర్‌పేట మండలం ఘన్‌పూర్‌ వద్ద నిర్మించిన సంప్‌హౌస్‌కు భారీ గొట్టాల ద్వారా ప్రతిరోజూ 750 ఎల్‌ఎండీ (మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) నీటిని తరలిస్తున్నారు. ఈ గొట్టాల నుంచి నీటిని మళ్లించడం మూలంగా హైదరాబాద్‌కు వెళ్లే ప్రవాహం తక్కువై సరఫరాకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని భావించిన సర్కారు సమస్య ఉత్పన్నం కాకముందే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఫేజ్‌-2 కింద శాశ్వత పైప్‌లైను నిర్మాణాన్ని గజ్వేల్‌ వరకూ చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్‌కు ఏడాదికి 0.9 టీఎంసీలు, హైదరాబాద్‌కు 10 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. పథకాన్ని నిరాటంకంగా కొనసాగించాలనే ఉద్దేశంతో మల్లన్న సాగర్‌ జలాశయం నుంచి ఏటా 30 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు మిషన్‌ భగీరథ డీఈ నాగార్జునరావు ధ్రువీకరించారు.

ప్రయోజనం పొందేవి

కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు, 7 మున్సిపాలిటీలకు అవాంతరాలు లేకుండా నీటిని సరఫరా చేయనున్నారు. పరిశ్రమల అవసరాలను కూడా తీరుస్తారు. ముఖ్యంగా గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట, ఆలేరు, జనగామ, భువనగిరి, మేడ్చల్‌, ఘన్‌పూర్‌, పాలకుర్తితో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు శుద్ధ జలాలు సరఫరా కానున్నాయి.

ఇదీచూడండి: WEATHER REPORT: రుతుపవనాల కదలికలు సాధారణం.. ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.