రెండవ బాసరగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో సరస్వతీ దేవి క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక సహస్ర గాయత్రీ జపం, హోమాలను చేపట్టారు. అనంతరం మహిళలచే లలితా సహస్రనామ పారాయణం చేయించారు. పలువురు ధార్మికులు ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ, సిద్ధాంతి ఋగ్వేద ఘనాపాటి నరేంద్ర కాప్రే, తెలుగు రాష్ట్రాల సంస్కృత భారతి ఛైర్మన్ దోర్బల ప్రభాకర శర్మ, కేంద్రీయ విద్యాలయం ప్రొ.సత్యనారాయణ శర్మలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఓయూలో విద్యార్థుల ఆందోళన