సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెరాస యువ నేత కొత్తపల్లి వేణుగోపాల్ బెస్త ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు పలు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నందునే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని 7 వ వార్డు బోయిగల్లి, పోచమ్మ గూడి, శరబీశ్వర ఆలయం, వివేకానంద కాలనీ ప్రజలకు కాయగూరలు అందించారు. కరోనా చాలా తీవ్రమైనదని... ప్రజలందరూ వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేణుగోపాల్ సూచించారు.
సామాజిక దూరం తప్పనిసరి !
సామాజిక దూరం పాటిస్తూ... చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకున్నాకే భోజనం చేయాలన్నారు. ముఖానికి మాస్క్ వేసుకునే బయటకు రావాలని కోరారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత వార్డు సభ్యులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: చిన్న పిల్లల్లో కరోనా భయాలు తగ్గించండి ఇలా..