Unanimous Resolution in Support of Harish Rao : సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)కు మద్దతుగా పలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాల వారిగా తీర్మానాలు చేస్తూ తమ ప్రియతమ నాయకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్(Harish Rao Double Hattrick Win) సాధించిన మంత్రిని.. ఏడోసారీ గెలిపించుకునేందుకు ప్రజలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. అభ్యర్థి ఖరారు కావడంతో హరీశ్‌రావును గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది.
Harish Rao Unanimous Win in Siddipet : సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్థులు బీఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందంటూ మహిళా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు మంత్రి హరీశ్‌రావుకు ఏకగ్రీవ తీర్మాన పత్రాలు అందజేశారు. రాంపూర్‌తో పాటు రావురుకుల, సిద్దిపేట పట్టణంలోని మూడో వార్డు, హరిహర రెసిడెన్సీ కాలనీ వాళ్లంతా కారు గుర్తుకే తమ ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి మంత్రికి అందజేశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలు తీరుస్తూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సాగు నీరు, తాగు నీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మహిళలకు వడ్డీ లేని రుణం, బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, డంప్ యార్డు, వైకుంఠదామాల నిర్మాణం.. ఇలా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలందరికీ అందేవిధంగా హరీశ్‌రావు కృషి చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
Harish Rao Election Strategy : 3 రోజుల క్రితం రాంపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్‌రావు రాంపూర్ గ్రామానికి వచ్చారు. మహిళలు మంగళ హారతులు పట్టి, డప్పు చప్పుళ్లు, బాణా సంచా, బోనాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, రెడ్డి కుల సంఘ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన, డంప్ యార్డు, వైకుంఠదామం ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకే తమ ఓటు అంటూ కుల సంఘ నాయకులు, గ్రామస్థులు మంత్రి హరీశ్‌రావుకు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను అందజేశారు.
. రికార్డులు బ్రేక్ చేసేలా ముందుకు..: ఈ సందర్భంగా గ్రామం చిన్నదైనా, గ్రామస్థుల మనసు పెద్దదని.. తనపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ కాపాడుకుంటానని మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మంత్రి హరీశ్‌రావు.. గత ఎన్నికల్లో లక్షా 18 వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈసారి అప్పటి రికార్డును బద్దలు కొట్టి.. రికార్డు సృష్టించే దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు.
Harish Rao Participated BRS Public Meeting At Maheswaram : 'తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది..'