సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో కార్మికులకు ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. అందులో భాగంగానే మౌన ప్రదర్శన నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.
ఇవీ చూడండి: 'సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'