సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవ్ ఆర్టీసీ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకున్నారు.
ఇదీ చదవండిః ప్రియాంకరెడ్డి మర్డర్: ఎక్కడో చంపేసి బైపాస్‌రోడ్డులో తగలబెట్టారు..