ETV Bharat / state

'ఆదర్శంగా నిలిచాం... ఆరోగ్యంగా ఉందాం'

ఆదర్శవంతమైన జిల్లాగా పేరుగాంచిన సిద్దిపేట... ఆరోగ్యవంతమైన జిల్లాగానూ పేరు సంపాదించాలని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు.

author img

By

Published : Oct 31, 2019, 5:27 PM IST

సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు పర్యటన
సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు పర్యటన

'మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..! స్వచ్ఛమైన ఆహారాన్ని తిందాం.. ఆరోగ్యవంతంగా జీవిద్దాం' అని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలో స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహార పదార్థాల వ్యాపారులకు శుచి, శుభ్రతపై అవగాహన కల్పించారు. నాణ్యతనే అసలైన పెట్టుబడి కావాలని హోటళ్ల నిర్వాహకులకు సూచించారు.

సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు పర్యటన

'మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..! స్వచ్ఛమైన ఆహారాన్ని తిందాం.. ఆరోగ్యవంతంగా జీవిద్దాం' అని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలో స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహార పదార్థాల వ్యాపారులకు శుచి, శుభ్రతపై అవగాహన కల్పించారు. నాణ్యతనే అసలైన పెట్టుబడి కావాలని హోటళ్ల నిర్వాహకులకు సూచించారు.

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_72_31_HARISH_AVAGHANA_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంది..! రోగం రాని ఆహారాన్ని తిందాం.. ఆరోగ్యవంతంగా జీవిద్దాం.! ఆదర్శవంతమైన సిద్ధిపేటగా ఖ్యాతిని పొందిన సిద్ధిపేట పేరు ప్రతిష్టలు కాపాడేలా రుచి, శుచి, ఆహార నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కోరారు. నాణ్యతనే మీ వ్యాపారానికి అసలు పెట్టుబడి కావాలని హోటల్ యాజమాన్యాలను నిధుల మంత్రి హరీశ్ కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్ లో గురువారం ఉదయం జరిగిన స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేట కార్యక్రమ నిర్వహణలో భాగంగా పట్టణంలోని ఆహార పదార్థాల వ్యాపారులకు శుచి, శుభ్రత పై అవగాహన సదస్సుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..... నాణ్యతనే మీ వ్యాపారానికి అసలు పెట్టుబడి కావాలి.మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంది..! రోగం రాని ఆహారాన్ని అందిద్దాం.. సిద్ధిపేట ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇద్దాం.ఆదర్శవంతమైన సిద్ధిపేటగా ఖ్యాతిని పొందిన సిద్ధిపేట పేరు ప్రతిష్టలు కాపాడేలా రుచి, శుచి, ఆహార నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.మేము చెప్పే చిన్నపాటి సూచనలను పాటిస్తే మీ వ్యాపారం, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.తినుబండారాల వ్యాపారులకు గిరాకీ పెరగాలంటే రుచితో పాటు శుచితో ఉండాలి.సిద్ధిపేటలోని 700 మంది వ్యాపారస్తులకు ప్రతి రోజూ 2 గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో 50 మందికి ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.శిక్షణతో పాటు మున్సిపాలిటీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల FSSAI సర్టిఫికేట్స్, అలాగే వెయ్యి రూపాయల విలువ కలిగిన కిట్ ఇస్తామని, ఆ కిట్ లో ఆఫ్రాన్, చేతి గ్లౌజులు, సబ్బులు తదితర పరిశుభ్రతకు అవసరమైన వస్తు సామగ్రి ఉంటాయని పేర్కొన్నారు. బైక్:హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.