సిద్దిపేట జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం ఎనిమిది నుంచే సూర్యుడు అగ్గి కురిపిస్తున్నాడు. సూర్య ప్రకోపానికి మండలంలోని ప్రజలు విలవిలలాడుతున్నారు. ఖరీఫ్ పంటల కోసం భూమి చదును చేసుకోవాల్సిన రైతులు ఉదయం 5 నుంచి ఎనిమిది వరకే పనులు చేసుకుంటున్నారు.
తర్వాత మళ్లీ సాయంత్రమే బయటకు వెళ్తున్నారు. ఎండవేడికి జనాలు ఆరు బయట చెట్ల కింద, అరుగుల మీద సేద తీరుతున్నారు. భానుడి సెగకు జనాలు బయటికి వెళ్లాలన్నా జంకుతున్నారు.
ఇవీ చూడండి : విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడి మృతి