సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో మునిగల అంజయ్య అనే రైతు కరెంట్ షాక్తో మరణించాడు. తన రెండు ఎకరాల మొక్కజొన్న పంటకు నీళ్లు పెడుతుండగా అక్కడ ఉన్న బోరు బావికి సంబంధించిన విద్యుత్ వైర్లు తగలడం వలన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రైతు మృతితో పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
ఇదీ చూడండి: ఎలక్ట్రికల్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్