ETV Bharat / state

బాతిక్‌ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం - Batik balayya eyelid

ప్రముఖ ‘బాతిక్‌’ చిత్రకారుడు యాసాల బాలయ్య కన్నుమూశారు. చిత్రకళా రంగంపై ఆరు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

‘బాతిక్‌’ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

author img

By

Published : Dec 24, 2020, 11:45 AM IST

Updated : Dec 24, 2020, 11:57 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ‘బాతిక్‌’ చిత్రకారుడు యాసాల బాలయ్య బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. బాలయ్య బాతిక్‌ చిత్రకళా రంగంపై ఆరు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేశారు. ఈ కళతో సిద్దిపేట ప్రాంతానికి వన్నె తెచ్చారు.

బతుకు చిత్రం ఆవిష్కరణ...

తెలంగాణ బతుకు చిత్రాలను అవిశ్రాంతంగా ఆవిష్కరించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ జీవన నేపథ్యం ఇతివృత్తంగా ఆయన గీసిన బాతిక్‌ చిత్రాలకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా శిబిరాలతో పాటు అమెరికాలో సైతం వందకు పైగా చిత్ర ప్రదర్శనల్లో బాలయ్య పాల్గొన్నారు.

ప్రధాన వేదికల్లో...

సాలార్‌జంగ్‌ మ్యూజియం, స్టేట్‌ మ్యూజియం, కేంద్ర, రాష్ట్ర లలితకళా అకాడమీలు, లేపాక్షి ఎంపోరియం, చెన్నైలోని రీజనల్‌ సెంటర్‌, అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ మ్యూజియం తదితర ప్రధానమైన వేదికల్లో ఆయన కళ దర్శనమిస్తుంది. ‘సమాజంలో రక్షణ లేని స్త్రీ’ అనే చిత్రాన్ని చూసి దివంగత ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ బాలయ్యను అభినందించారు. ఉద్యోగరీత్యా బాలయ్య ఉపాధ్యాయుడు.

బాతిక్​ కళపై పుస్తకం...

1994లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా.. అంతకుముందు రాష్ట్రస్థాయిలోనూ పురస్కారాలు అందుకున్నారు. బాతిక్‌ చిత్రకళపై పుస్తకాన్ని కూడా రచించారు. చిత్ర కళాప్రవీణ, కళారత్న, బాతిక్‌ బ్రహ్మగా పేరుగాంచారు. బాలయ్య మృతిపై మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని, కళారంగానికి తీరని లోటన్నారు.

సీఎం సంతాపం..

బాతిక్ బ్రహ్మ బాలయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరనిలోటన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టారని సీఎం కొనియాడారు. బాలయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి: గుడ్‌గావ్‌ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..

Last Updated : Dec 24, 2020, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.