ETV Bharat / state

Siddipet IT Tower Inauguration : సిద్దిపేట సిగలో మరో మణిహారం.. రేపే ఐటీ హబ్ ప్రారంభం - IT Hub Inauguration in Siddipet Tomorrow

మ: సిద్దిపేట సిగలో మరో కలికితురాయి చేరనుంది. వందలాది మందికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించే ఐటీ టవర్ నిర్మాణం పూర్తైంది. మెట్రో నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఐటీ టవర్ నిర్మించారు. ఈనెల 15వ తేదీన ఈ టవర్​ను మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

KTR and Harish Rao will be inaugurated Siddipet IT Tower

author img

By

Published : Jun 14, 2023, 11:11 AM IST

IT Hub Inauguration in Siddipet Tomorrow : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే యువతలో ప్రత్యేకమైన క్రేజ్. ఇంజినీరింగ్ పూర్తి అవుతుండగానే.. విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఐతే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలంటే మాత్రం ఉన్న ఊరిని, అయిన వాళ్లని వదలి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రథమశ్రేణి నగరాలకు వలస వెళ్లాల్సిందే. అయితే దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. కేవలం హైదరాబాద్​లోనే కాకుండా.. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకువస్తోంది.

Siddipet IT Hub Inauguration Tomorrow : ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్​లలో ఐటీ హబ్​లను నిర్మించింది. అక్కడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికే ఆయా నగరాల్లోని ఐటీ టవర్​లలో పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా సిద్దిపేటలోనూ ఓ ఐటీ హబ్ నిర్మించింది రాష్ట్ర సర్కార్. ఈనెల 15వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావుతో కలిసి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట ఐటీ హబ్​ను ప్రారంభించనున్నారు.

  • Taking Technology job opportunities to youngsters of Tier 2 towns has been a major focus for Telangana Govt

    Will be inaugurating the IT Hub in Siddipet tomorrow along with @BRSHarish Garu

    Next will be Nizamabad IT Hub in July & Nalgonda IT Hub in August pic.twitter.com/yxKhm049tV

    — KTR (@KTRBRS) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Siddipet IT Tower details : సిద్దిపేట శివారులో రాజీవ్ రహదారిపై సాఫ్ట్‌వేర్ కంపెనీల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించింది. సుమారు రూ.63కోట్లలతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇందుకోసం భవనాన్ని నిర్మించారు. పెద్ద పెద్ద నగరాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సౌకర్యాలు కల్పించారు. జీ+4 తరహాలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు.

  • మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి.
  • రెండో అంతస్తులో క్యాబిన్లు, ఒపెన్ వర్క్ స్టేషన్లు, క్లోజ్డ్ వర్క్ స్టేషన్లు ఉన్నాయి. టాస్క్ శిక్షణ కేంద్రం సైతం ఇక్కడే ఉంది.
  • మూడో అంతస్తులో టీఎస్ఐఐసీ కార్యాలయం, బోర్డు గదులు, వీహబ్, వర్క్ స్టేషన్లు ఉన్నాయి.
  • నాలుగో అంతస్తులో సైతం వర్క్ స్టేషన్లు ఉన్నాయి.
  • సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు

Siddipet IT Tower Facilities : సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. రెండు సంవత్సరాల పాటు నిర్వాహణ, అద్దె, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లుల్లో ప్రభుత్వం మినహాయింపులు ఇస్తోంది. ఐటీ టవర్‌లోనే టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా శిక్షణ ఇవ్వనున్నారు.

Siddipet IT Tower Inauguration : ప్రారంభోత్సవం నాటి నుంచే కార్యకలాపాలు మొదలయ్యేలా దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు 12 పైగా పరిశ్రమలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక యువతకు ప్రాముఖ్యత ఇస్తూ జాబ్ మేళా నిర్వహించారు. 8వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిని వివిధ దశల్లో పరీక్షించి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారు. దశలవారీగా తమ సిబ్బంది సంఖ్యను పెంచేలా సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌళిక వసతులపై, యువత నైపుణ్యాలపై కంపెనీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియలో విఫలమైన వారికి టాస్క్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారి నైపుణ్యాలు మెరుగు పరచనున్నారు.

"సిద్దిపేటలో విద్యార్థులు చదువు పూర్తి అయిన తరవాత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా ఐటీ హబ్​ను నిర్మించారు. సుమారు 15 కంపెనీలను తీసుకువచ్చారు. ఈ నెల 15న ప్రారంభిస్తున్నారు. ఇందులో పని చేసేందుకు స్థానిక విద్యార్థులకు జాబ్​ మేళా నిర్వహించారు. ప్రారంభించిన రోజు నుంచే పూర్తి స్థాయిలో కొనసాగనుంది." - సంతోష్, సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధి

How many people work in Siddipet IT Office : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం స్థానికంగానే లభించడంతో స్థానిక యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిదశలో భాగంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రస్తుతం 720మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంది. రెండు షిఫ్టుల్లో కలిపి సుమారు 1400మంది వరకు పని చేయనున్నారు. వెయ్యి మంది పని చేసే సామర్థ్యంతో త్వరలో రెండో దశ పనులను సైతం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన స్పందనపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.