సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అయిలేని అనిత శ్రీనివాస్ రెడ్డి ఈరోజు లందాకు, బొడ్రాయికి పసుపు, కుంకుమలు అప్పగించి గౌడ కులస్తుల నుంచి ఘటం తీసుకుని ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రవీందర్ గౌడ్ తెలిపారు.
కరోనా కారణంగా కేవలం అర్చకులు, కమిటీ సభ్యుల సమక్షంలోనే కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారికి గౌడ కులస్తుల బాసికాలు కట్టడంతో పాటు అర్చకులు అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కిన్నెర పంబల వారు పట్నం వేసి, కథ చెప్పారని తెలిపారు. అనంతరం ద్వార బంధనం చేయడం జరిగిందన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు నిలివేశామని రవీందర్ గౌడ్ అన్నారు.
ఇదీ చదవండి : 'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'