ETV Bharat / state

గజ్వేల్​లో రోడ్డు ప్రమాద మృతుడి బంధువులు ఆందోళన - siddipet latest news

గుర్తుతెలియని టిప్పర్​ ఢీకొట్టిన ఘటనలో మృతిచెందిన యువకుడి కుటుంబసభ్యులు గజ్వేల్​లో రాస్తారోకో నిర్వహించారు. ప్రజ్ఞాపూర్​ రాజీవ్​రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్​ డ్రైవర్​ను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

siddipet crime news
రోడ్డు ప్రమాద మృతుడి బంధువులు ఆందోళన
author img

By

Published : Feb 25, 2020, 11:23 AM IST

గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్​ను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్​ రహదారిపై ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని టిప్పర్ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ప్రమాదానికి కారకుడైన టిప్పర్​ డ్రైవర్​ను గుర్తించి కఠింనంగా శిక్షించాలంటూ మృతుడి తరఫు బంధువులు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తావద్ద రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

రోడ్డు ప్రమాద మృతుడి బంధువులు ఆందోళన

ఇదీ చూడండి: కారు ద్విచక్ర వాహనం ఢీ... దంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.