సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇవాళ ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసిపోయింది.
ఐదారు రోజుల క్రితమే ధాన్యం తీసుకొచ్చినా.. కొనుగోలు చేయలేదని.. కనీసం టార్ఫాలిన్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. అధికారుల తీరువల్లనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: నేతన్నల యాతన... వైరస్ వ్యాప్తితో కష్టాలు!