కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి పాఠశాలలు నడవకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ప్రైవేట్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో రహదారులపై టీ, కూరగాయలు అమ్ముతూ నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలు నడపడం, ప్రైవేట్ ఉపాధ్యాలుగా పని చేయడం కంటే టీ కొట్టు పెట్టుకోవడం నయమని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా.. ట్రస్మా పిలుపుమేరకు వినూత్న నిరసనలు చేపడుతున్నామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్... విద్యార్థులు, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి : మద్యం మత్తులో ఇంటికి నిప్పు- ఆరుగురు సజీవదహనం