దుబ్బాకలో భాజపా గెలుపునకు మంత్రి హరీశ్ రావు పరోక్షంగా సహకరించారని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జిపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసభ్య పదజాలంతో దూషించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని అందుకే సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'మజ్లిస్ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్ పాలన'