ETV Bharat / state

చేనేత కార్మికుడు మృతి చెందితే ఐదు లక్షల బీమా, హరీశ్​రావు ప్రకటన - ఆసరా పింఛన్లు

Pension Disbursement Program తెలంగాణ రాష్ట్రం వచ్చాక కన్న కొడుకులా, ఆసరా పింఛన్ వస్తున్న ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ నెలనెలా రూ. 2016 ఇవ్వడం అదృష్టమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మండలంలో 1804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా హయాంలో రూ.50 ఫించన్లు, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉండేవని, పింఛన్లు ఇచ్చే దాక ఉంటారో, మరణిస్తారో తెలిసేది కాదని గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తీరును మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో హరిశ్​రావు
Pension Disbursement Program in Siddipet
author img

By

Published : Aug 27, 2022, 5:36 PM IST

Pension Disbursement Program: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మండలంలో 1804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలనెలా రూ.2016 ఆసరా ఫించన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దుబ్బాక పట్టణంలో 816, దుబ్బాక మండలంలో 988 మందికి ఆసరా పింఛన్లు, మొత్తం 1804 మందికి కొత్త పింఛన్లు ఇచ్చిన ఘనత కేవలం సీఎం కేసీఆర్​కి దక్కుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కన్న కొడుకులా.. రాష్ట్రానికే కాకుండా ఆసరా పింఛన్ ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ రూ.2016 ఆసరా పింఛన్లు ఇవ్వడం అదృష్టం. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి, దుబ్బాక నియోజకవర్గంలో 50 వేల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలితే అర్హులైన వారందరికీ ఇస్తాం. ఈనెల నుంచి చేనేత కార్మికుడు మృతి చెందితే.. రూ.5లక్షల బీమా వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెచ్చింది.

దుబ్బాక నియోజకవర్గ వర్గానికి కొత్తగా 6 వేల ఆసరా పింఛన్లు. ప్రతీ పేదవారికి, అర్హుడికి అందేలా చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని.. సాగు, త్రాగు నీటి గోస పోయింది. రెండు నెలల నుంచి కూడెల్లి వాగు మత్తడి దూకుతున్నది. తెరాస ప్రభుత్వం వచ్చాక ప్రతీ వర్గాన్ని అక్కున్న చేర్చుకుని, ఆదుకుంటున్నది. గతంలో గ్రామాలకు ఎమ్మెల్యేలు వెళ్తే బిందెలతో అడ్డుకునేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కొత్త ఆసరా పింఛను లబ్ధిదారులకు శుభాకాంక్షలు. -హరీశ్​రావు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి

త్వరలో దుబ్బాక జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని హరీశ్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జెడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అన్నం పెట్టిన చేతిని మరిచిపోవద్దు మీరందరూ కేసీఆర్​ను గుర్తుపెట్టుకోవాలి. త్వరలోనే ప్రెస్​క్లబ్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం. ఇంటికి పెద్ద కొడుకులా నెలనెల రూ.2016 ఇస్తున్నా నాయకుడు మన కేసీఆర్​. తెలంగాణలో మెుత్తం 50లక్షల పింఛన్లు ఇస్తుంటే ఒక్క దుబ్బాక నియోజక వర్గంలోనే 50 వేలు పింఛన్లు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానిది. రైతు బంధు, కళ్యాణిలక్ష్మీ, కేసీఆర్ కిట్​ ఇలా చాలా పథకాలు ఇస్తున్నాం. ఈనెల నుంచి చేనేత కార్మికులు మరణిస్తే అయిదు లక్షల బీమా కల్పిస్తున్నాం.-హరీశ్​రావు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్నహరీశ్​రావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.