ETV Bharat / state

నాణ్యతాలోపంతోనే 'కొండపోచమ్మ'కు గండి: ఉత్తమ్​కుమార్ రెడ్డి - గండి పోచమ్మ కాల్వను సందర్శించిన ఉత్తమ్​కుమార్​

కొండపోచమ్మ సాగర్ పంట కాల్వను కాంగ్రెస్‌ బృందం పరిశీలించింది. నిన్న శివారువెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ పంట కాల్వకు గండి పడి... ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రామమంతా జలమయమైంది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

pcc chief uttam kumar reddy visited kondapochamma canel break in siddipet district
కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం: ఉత్తమ్
author img

By

Published : Jul 1, 2020, 1:25 PM IST

Updated : Jul 1, 2020, 2:09 PM IST

కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం: ఉత్తమ్

కమీషన్ల కోసమే తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. బుధవారం కొండపోచమ్మ సాగర్ పంట కాల్వను ఆయన పరీశీలించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా శివారువెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ పంట కాల్వకు గండి పడి ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రామమంతా జలమయమైంది. గండి పడిన ప్రాంతాన్ని ఉత్తమ్​తోపాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

దశాబ్దాల కిందట మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్​ కాలువలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని పేర్కొన్నారు. సిమెంట్​తో నిర్మించిన కొండపోచమ్మ కాలువలు ప్రారంభించిన నెలరోజుల్లోనే గండి పడటం నాణ్యత నాసిరకం పనులకు నిదర్శమని మండిపడ్డారు.

కేసీఆర్​ కొవిడ్​ 19 నిబంధనలు ఉల్లంఘించి.. కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించి.. గొప్పలు చెప్పుకున్నారని అభిప్రాయంవ్యక్తం చేశారు.సీఎం​ వ్యవసాయ క్షేత్రానికి సమీపంలోనే కాలువకు గండి పడితే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపంపై ముందు నుంచే హెచ్చరిస్తున్నామని చెప్పారు. పంట కాల్వకు గండిపై ఈఎన్‌సీ హరిరాం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడిన ఈఎన్‌సీ హరిరాంను వెంటనే సస్పండ్‌ చేయాలని డిమాండ్​ చేశారు. గండికి సంబంధించిన పరిహారాన్ని ఈఎన్‌సీ జీతం నుంచి వసూలు చేయాలని కోరారు. 24 గంటలైనా బాధితులకు పరిహారంపై కలెక్టర్‌ స్పందించలేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

Last Updated : Jul 1, 2020, 2:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.