ETV Bharat / state

'దుబ్బాక కాంగ్రెస్​దే.. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీ' - తెరాసపై ఉత్తమ్ విమర్శలు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వస్తే దుబ్బాకను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని తెలిపారు.

'దుబ్బాక కాంగ్రెస్​దే.. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీ'

author img

By

Published : Oct 12, 2020, 3:35 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎన్నికల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చేనేత సంఘాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

" మంత్రి హరీశ్​రావు అభ్యర్థిని కాదు నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు. కానీ మేము అభ్యర్థిని చూసి ఓటు వేయండి అంటున్నాం. గతంలో చెరుకు ముత్యంరెడ్డి నిజాయతీగా పని చేశారు. వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి అలాగే పని చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే దుబ్బాక ప్రాంతం బాగుపడుతుంది."

-ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు తీసుకుపోయిన నిధులు... దుబ్బాకకు ఎందుకు తీసుకురాలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. నాలుగేళ్లైనా దుబ్బాకలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. రాష్ట్రంలో తెరాసపై వ్యతిరేకత మొదలైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఎల్ఆర్ఎస్​ను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు.

'దుబ్బాక కాంగ్రెస్​దే.. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీ'

ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.