దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా గజ్వేల్ మండలం కొల్గూర్లో ఆయన పర్యటించి.. గ్రామంలో మొక్కలు నాటారు.
పట్టణ ప్రాంతాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని దీనితో పల్లెలన్నీ అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకొని పల్లెల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్