సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బాలవికాస సంస్థలో 12 మంది అనాథ బాలల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ అనిత, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి హాజరయ్యారు. బాలవికాస మహిళా సభ్యుల సమక్షంలో సంస్థ మేనేజర్ లత... పిల్లల చేత కేట్ కట్ చేయించారు.
తల్లిదండ్రులు లేని బాధ సభలో పంచుకోవడంతో... అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. పిల్లల పోషణ, చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో... వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు నృత్యాలు చేసి అందరినీ అలరించారు.
ఇదీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'