సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తొలి కరోనా కేసు నమోదయింది. జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మూడ్రోజుల కిందట హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తికి వైద్యులు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధరణ అయింది.
అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తి కుటుంబంలోని నలుగురితో పాటు.. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని హోంక్వారంటైన్ చేశారు. సదరు వ్యక్తి మృతదేహానికి హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. చివరిచూపు చూసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులను అనుమతించలేదు.
- ఇదీ చూడండి:ఆ కంపెనీలో 25వేల మంది ఉద్యోగులు తొలగింపు