ETV Bharat / state

నామినేషన్​కు భారీ భద్రతా చర్యలు: సీపీ జోయల్​ - దుబ్బాక నామినేషన్​పై సీపీ జోయల్​ డేవిస్​

సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్​ కార్యాలయంలో నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. నామపత్రాలు దాఖలు చేసే ప్రాంతానికి 200 మీ. ముందు నుంచే భద్రతా చర్యలు చేపట్టినట్లు కమిషనర్​ జోయల్​ డేవిస్​ వెల్లడించారు.

nomination process started at dubbaka with proper security
నామినేషన్​ ప్రక్రియ షురూ.. భారీ భద్రతా చర్యలు: సీపీ జోయల్​
author img

By

Published : Oct 9, 2020, 4:32 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్​ కార్యాలయంలో నామినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశామని.. నామినేషన్​ దాఖలు చేసిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టామని సీపీ జోయల్​ డేవిస్​ తెలిపారు. ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాల మేరకు అభ్యర్థితో పాటు ఇద్దరినీ మాత్రమే లోపలికి పంపిస్తున్నామన్నారు.

నామపత్రాలు​ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులకు నామినేషన్ వేసే ప్రాంతంలో భద్రతను పరిశీలించినట్లు సీపీ తెలిపారు. అక్కడ 200 మీ. నుంచి ఇద్దరు ఏసీపీలతో పాటు ఇన్​స్పెక్టర్​, ఎస్సైతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం అందించామని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టామని కమిషనర్ చెప్పారు.

ఇదీ చదవండిః 'దుబ్బాక ఎన్నిక నాలుగు కోట్ల మంది భవిష్యత్​కు సంబంధించినది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.