ETV Bharat / state

'రాజగృహ దాడి నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి' - mrps leaders protest news

సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్​ నాయకులు ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ముంబయిలో అంబేడ్కర్​ నివాసంపై దాడి కేసులోని నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్​ చేశారు.

mrps leaders protest in siddipet
mrps leaders protest in siddipet
author img

By

Published : Jul 31, 2020, 3:31 PM IST

ముంబయిలో అంబేడ్కర్ నివాసం రాజగృహంపై దాడి... రాజ్యాంగంపై దాడితో సమానమని ఎంఆర్పీఎస్​ నాయకులు ఆరోపించారు. నిందితులపై రాజద్రోహం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు సిద్దిపేటలో ఒక రోజు మహా దీక్ష కార్యక్రమం చేపట్టారు.

ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర బలగాల చేత రాజగృహానికి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఇదీచదవండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.