సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కరోన మహమ్మారి నివారణకు మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
వేద పండితుల ఆధ్వర్యంలో అధికారులు హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ, ఏఈఓ వైరాగ్యం అంజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాబోయే మూడు రోజుల్లో వడగండ్ల వర్షాలు.!