సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చేనేత కార్మికులు మూడో రోజు చేస్తున్న రిలే నిరాహార దీక్షాస్థలిని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. కార్మికులతో దాదాపు గంటపాటు.. వారి న్యాయమైన డిమాండ్లపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం దీక్షలు చేపట్టిన కార్మికులకు నిమ్మరసాన్ని ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెరాస ప్రభుత్వం మాటతప్పదని.. సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ జియో ట్యాగ్ కల్పించేందుకు కృషి చేస్తానని.. ప్రతి చేనేత కుటుంబానికి రూ.పది లక్షల రుణం అంశంపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్