సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే బాలకిషన్ పర్యటించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో గోడకూలి గొర్రెలు మృతి చెందిన ఘటనలో కాపరులకు 67వేలు విలువైన చెక్కును అందజేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ' ప్రభుత్వం మహిళా కమిషన్‌ను నిర్వీర్యం చేస్తోంది'