ETV Bharat / state

ఎర్రకోటపై గులాబీ​ జెండా ఎగరడం ఖాయం: మంత్రి మల్లారెడ్డి - బీజేపీపై మంత్రి పైర్​

Minister mallareddy fires on BJP: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

minister malla reddy
మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Nov 27, 2022, 4:48 PM IST

దిల్లీ ఎర్రకోటపై బీఆర్​ఎస్​ జెండా ఎగరడం ఖాయం

Minister mallareddy fires on BJP: 2024లో దిల్లీ ఎర్రకోటపై బీఆర్​ఎస్​ జెండా ఎగరటం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామన్నారు. తనపై 500 మంది పెట్టి ఐటీ దాడులు చేయించారని.. అయినా తాను భయపడలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతకాలం తనకు భయం లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ దేశంలో విద్యుత్తు ఉన్నప్పటికీ దానిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే దమ్ము బీజేపీకి లేదని చెప్పారు. తాగు సాగునీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు అందించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలంతా కేసీఆర్​ వైపే చూస్తున్నారని అన్నారు. 2024లో దిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలు వ్యక్తి కాదని మహాత్ముడు ఓ గొప్ప వ్యక్తి అన్నారు. ప్రజలకు అంబేద్కర్ తర్వాత సేవ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేసీఆర్​నే. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తాము. 2024లో దిల్లీలో అధికారంలోకి రావడం ఖాయం. లాల్​కోటపై బీఆర్​ఎస్ జెండా​ ఎగరడం ఖాయం." - మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.