సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రపూర్‌లోని రంగనాయక సాగర్ టన్నెల్లో మూడో పంపును ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో నాల్గో మోటార్నూ ప్రారంభిస్తామని తెలిపారు.
రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 0.5 టీఎంసీ నీరు చేరుకుందని మంత్రి తెలిపారు. 1.5 టీఎంసీలు చేరగానే కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లు విడుదల చేస్తామన్నారు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ పంప్‌హౌస్‌కు సైతం త్వరలోనే నీళ్లు పంపిస్తామని స్పష్టం చేశారు.
రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా 500 చెరువులను నింపడమే కాకుండా.. సాగు భూములకూ నేరుగా నీళ్లు అందిస్తామని మంత్రి తెలిపారు 2, 3 రోజుల్లో దాదాపు 200 చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపుతామన్నారు. ఇంకా ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్