ETV Bharat / state

'నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్' - మల్లన్న సాగర్​ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న కేసీఆర్​

KTR And Harish Rao On Mallanna Sagar : రాష్ట్ర నీటిపారుదల రంగం చరిత్రలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నీరిచ్చేలా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​ బుధవారం ప్రారంభించనున్నారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : Feb 22, 2022, 10:13 PM IST

Updated : Feb 22, 2022, 10:33 PM IST

నదిలేని చోట ఆనకట్ట...

Harish Rao On Mallanna Sagar: నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ నడిగడ్డపై నిర్మితమైందని.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నీరిచ్చేలా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. జంటనగరాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలతో పాటు రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ఈప్రాజెక్టును సీఎం కేసీఆర్​ స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందని... నిర్వాసితుల కోసం గజ్వేల్‌లో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించామని మంత్రి హరీశ్​రావు తెలిపారు.

'నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్'

'రెండు టీఎంసీ నీరు మల్లన్న సాగర్​కు రావడమంటే 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నిరంతరం మల్లన్న సాగర్​లోకి వస్తుంది. నదికి కొత్త నడక నేర్పారు ముఖ్యమంత్రి కేసీఆర్​. కానీ గోదావరి నీళ్లను వెనక్కు తీసుకొచ్చి కూడవెళ్లిలో కలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​ది. 90మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నదిని 550 మీటర్ల ఎత్తులో ఉండే మల్లన్న సాగర్​కు అంటే దాదాపు అరకిలోమీటర్​కు ఎత్తి మల్లన్నసాగర్​ను నింపడమనేది ఒక గొప్ప ప్రయత్నం. విమర్శలకు మా సమాధానం ఏమిటంటే పనితనమే సమాధానం.' -హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​ బుధవారం ప్రారంభించనున్నారు. భారీ మట్టికట్టతో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ నిర్మించారు. నీటిని ఎత్తిపోసే పంపుహౌస్‌లో.. మోటార్లను ఆన్‌ చేయడం ద్వారా..... ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. మల్లన్నసాగర్‌ వద్ద సభా ప్రాంగణంతో పాటు పంప్‌హౌస్‌, హెలీప్యాడ్‌ వద్ద ఏర్పాట్లను తనిఖీ చేశారు.

KTR On Mallanna Sagar: రాష్ట్ర నీటిపారుదల రంగంలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టామని.. ఈ ప్రాజెక్టు ద్వారా 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

  • Tomorrow will be a momentous day in Telangana’s irrigation history as Hon’ble CM KCR Garu will be dedicating “Mallanna Sagar” to the Nation

    This 50 TMC reservoir is part of the world’s largest lift irrigation project #KaleshwaramProject and will irrigate 11.29 Lakh Acres pic.twitter.com/RlOB6mjepE

    — KTR (@KTRTRS) February 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి : Srivalli Township: 'ఈ-వేలం' ద్వారా రాజీవ్‌ గృహకల్ప ప్లాట్ల విక్రయం

Last Updated : Feb 22, 2022, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.