ETV Bharat / state

చిన్నకోడూర్​ మండలంలో పర్యటించిన హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్​ మండలం గంగాపూర్​, విఠలాపూర్​ గ్రామాల్లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్థులతో మంత్రి ముచ్చటించారు.

author img

By

Published : May 10, 2020, 4:03 PM IST

minister Harish Rao toured at Chinnakodur in siddipet district
చిన్నకోడూర్​ మండలంలో పర్యటించిన హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్, విఠలాపూర్​ గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ముందుగా గంగాపూర్​లో పర్యటించిన మంత్రి.. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందా అని అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

అనంతరం మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. లాక్​డౌన్ కారణంగా రేషన్​ కార్డుదారులకు అందిస్తున్న రూ.1500 అందాయా అని ఆరా తీశారు. ఈసారి వరి పంటలు కాకుండా.. మిరప, ఇతర కూరగాయల పంటలు పండించి లాభాలు పొందాలని వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం ఏ రైతూ చిన్నకోడూర్, సిద్దిపేటకు రావొద్దని.. ఎక్కడివక్కడే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

అనంతరం విఠలాపూర్​లో పర్యటించిన మంత్రి.. గ్రామంలోని అనంతమ్మ కుంట కాళేశ్వరం జలాలతో నిండి, మత్తడి పోస్తుండటం వల్ల గంగమ్మ తల్లికి జల హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటే.. కడుపు నిండా భోజనం చేసినట్లుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: ఇల్లు శుభ్రం చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.