ETV Bharat / state

'సిద్దిపేటలో మరో వెయ్యి ఇళ్ల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం' - cm kcr tour to siddipet on dec 10th

డిసెంబర్​ 10న ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది డబుల్​ బెడ్​రూం లబ్ధిదారులు గృహప్రవేశం చేసేలా ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఇప్పటికే 2,460 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. సిద్దిపేట కోసం వెయ్యి ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

minister harish rao spok on double bed room houses in siddipet
'సిద్దిపేటలో మరో వెయ్యి ఇళ్ల కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం'
author img

By

Published : Dec 8, 2020, 11:04 PM IST

సిద్దిపేట పట్టణంలో గూడు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు నిర్మించే అదృష్టం కలగడం పూర్వ జన్మ సుకృతమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇప్పటికే నిర్మించిన 2,460 ఇళ్లతో పాటు సిద్దిపేట కోసం మరో 1,000 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. న‌ర్సాపూర్ డ‌బుల్ బెడ్‌రూం హౌజింగ్ కాల‌నీలో ఎంపికైన 144 మంది ల‌బ్ధిదారుల‌కు మంత్రి మంగ‌ళ‌వారం స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేశారు. ల‌బ్దిదారుల‌కు నూత‌న వ‌స్త్రాలను బ‌హూక‌రించారు. వీరు ముఖ్యమంత్రి సమక్షంలో డిసెంబ‌ర్ 10న గృహ‌ప్ర‌వేశాలు చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. పట్టా ఉత్తర్వుతో పాటు నల్లా కనెక్షన్​ మంజూరు పత్రం, కరెంట్​ కనెక్షన్​, ఇంటి నెంబర్​, గ్యాస్​ కనెక్షన్లు అందజేస్తున్నామన్నారు.

మొత్తం 1,341 మంది ల‌బ్ధిదారులుగా ఎంపిక‌య్యార‌న్నారు. మిగతా వారికి ద‌శ‌ల వారీగా గృహాల‌ను అంద‌జేస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం మొత్తం 2,460 ఇండ్ల‌ను నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. వీటి నిర్మాణం పూర్తైన వెంట‌నే అద‌నంగా మ‌రో వెయ్యి డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌ను నిర్మిస్తామ‌న్నారు. ద‌శాబ్దాలుగా గూడు లేనివారికి త‌న చేతుల మీదుగా పట్టాలు అంద‌జేయ‌డం నిజంగా ఆశీర్వాద‌మేనని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.