నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అద్భుత విజయం సాధించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, భాజపాలకు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఉపఎన్నికలో జరిగిందే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేగుంట మండలం బాలాజీ గార్డెన్లో భాజపా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : నాంపల్లి కోర్టుకు.. రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు