సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల కొండపోచమ్మ జలాశయం నుంచి కూడవెల్లి వాగుకు గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విడుదల చేశారు. కూడవెల్లి వాగు కొత్త దశ దిశ చూపి పునర్జన్మను ప్రసాదించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తీసుకువచ్చి కూడవెల్లి వాగుకు జీవ జలకళ తెచ్చామన్నారు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. ఈ నీటి విడుదలతో రైతుల కళ్లల్లో వెయ్యి ఓట్లు వేస్తే వచ్చే వెలుగు కనిపిస్తుందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు ప్రస్తుత ఫలితాలు చూసి ఈర్శ్య పడుతున్నారన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు మా పని తీరుతోనే సమాధానం చెబుతున్నామన్నారు
ఇదీ చదవండి: 13ఏళ్లు పూర్తి చేసుకున్న శంషాబాద్ విమానాశ్రయం