ETV Bharat / state

Harishrao on Central: ధాన్యం కొనుగోళ్లు జరగకూడదనే కేంద్రం కుట్రలు: హరీశ్‌రావు

author img

By

Published : May 5, 2022, 4:16 PM IST

Updated : May 5, 2022, 4:27 PM IST

Harishrao on Central:రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లను తనిఖీల పేరుతో వేధిస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harishrao on Central
హరీశ్‌రావు

Harishrao on Central: వడ్ల కొనుగోళ్లు ఆలస్యం చేయాలనే కుట్రతోనే మిల్లులపై కేంద్రం దాడులు చేయిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేశాకే ఎఫ్​సీఐ తనిఖీలు చేపట్టాలని తెలిపారు. సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు.

దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉన్నా కూడా.. తెలంగాణ వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం తొండాట ఆడుతోందని హరీశ్ రావు విమర్శించారు. బాయిల్డ్ రైస్ కొనమని కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 వేల కోట్ల భారం పడుతున్నా రైతులను కాపాడాలని నిర్ణయించారు. రాష్ట్రంపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం 2900 రైస్ మిల్లులపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనవద్దు అన్న కారణంతో ఎఫ్​సీఐ అధికారులతో దాడులు చేయిస్తోంది. మిల్లు యాజమాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుద్ది. వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తది. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు. కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు సోదరులు దీన్ని గమనించాలి. 2990 మిల్లులపై దాడులు చేస్తరా? ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. వడ్లు కొనమని తొండాట ఆడారు. కొనకపోతే తెలంగాణకు చెడ్డపేరు రావాలనేది కేంద్రం లక్ష్యం.

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి

తడిసిన ధాన్యం ఆరబెట్టి కొనుగోలు చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని.. మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిద్దిపేటలో 600 ప్యాడీ క్లీనర్లు, 421 కొనుగోలు కేంద్రాలు, 4 వేల టార్పాలిన్ ఒక్క సిద్దిపేటలోనే ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులు కూడా ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని హరీశ్ రావు సూచించారు. మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్లలోని లోతట్టు ప్రాంతంలో ధాన్యం ఆరబొస్తే అకాల వర్షానికి తడిసిపోయిందని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు జరగకూడదనే కేంద్రం కుట్రలు: హరీశ్‌రావు

రైతులను ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని.. ఈ కుట్రలను గమనించాలని హితవు పలికారు. ఎరువులు, డీజీల్ ధరలు పెంచడం వల్ల ఎకరం దున్నడానికి ఐదు వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వరి కోత మిషన్​ ఖర్చు ఇవాళ రెండు వేలు దాటిందన్నారు. రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మిల్లుల ముందు ఎఫ్​సీఐ అధికారులు రైతులను వేధించడం ఇప్పటికైనా విరమించుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.

ఇవీ చూడండి:ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష.. సాఫీగా సాగుతోందని అధికారుల వివరణ..

ఆటోపై 'మినీ తోట'.. సమ్మర్​లో సూపర్​ కూల్.. సెల్ఫీలతో ఎక్స్​ట్రా ఇన్​కమ్​!

Last Updated : May 5, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.