ETV Bharat / state

'అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోంది' - dubbaka updates

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్​హాల్​లో ధర్మాజీపేట, హబ్సీపూర్ గ్రామాల భాజపా నాయకులు, యువకులు మంత్రి హరీశ్​రావు సమక్షంలో తెరాసలో చేరారు. దుబ్బాక నియోజకవర్గంలో భాజపా ఖాళీ అవుతోందని... అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని హరీశ్​రావు ఆరోపించారు.

దుబ్బాకలో భాజపా ఖాళీ అవుతోంది: మంత్రి హరీశ్​రావు

author img

By

Published : Oct 18, 2020, 9:01 PM IST

రోజురోజుకు దుబ్బాక నియోజకవర్గంలో భాజపా ఖాళీ అవుతోందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకుని భాజపా... రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్​హాల్​లో ధర్మాజీపేట, హబ్సీపూర్ గ్రామాల భాజపా నాయకులు, యువకులు హరీశ్​రావు సమక్షంలో తెరాసలో చేరారు.

బీడీ కార్మికులకు పదహారు వందలు ఇస్తున్నట్లు భాజపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 16 పైసలైనా ఇచ్చినట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్​ చేశారు. అబద్దాలతోనే అధికారంలోకి రావాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్న యూపీలో వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం రూ. 500 ఇస్తోందని... కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాజస్థాన్​లోనూ రూ. 500 ఇస్తోందని... తెలంగాణలోనే రూ. 2,000 ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాంటిది తెరాస ప్రభుత్వాన్ని కాంగ్రెస్, భాజపా ఎలా విమర్శిస్తారని హరీశ్​రావు ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'కమిటీలు నివేదికలు ఇచ్చినా... ప్రభుత్వం కమిషన్‌లకు కక్కుర్తిపడింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.