ETV Bharat / state

ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు: హరీశ్ రావు - ఉద్యానవన పంటలు తాజా వార్తలు

Harish rao on oil farm: రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పామాయిల్ సాగుతో రైతన్నలకు ఆర్థిక భరోసా కలుగుతుందని మంత్రి తెలిపారు. చరిత్రలో మొదటి సారి ఆయిల్​పామ్ సాగుకు బడ్జెట్​లో 1,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పంట సాగులో సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు.

Harish RAO ON OIL FARM
హరీశ్ రావు
author img

By

Published : Mar 17, 2022, 10:35 PM IST

Harish rao on oil farm: ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. చరిత్రలో మొదటిసారి పామాయిల్ సాగుకు రాష్ట్ర బడ్జెట్​లో వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చండ్లపూర్ గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై 622 మంది రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు: హరీశ్ రావు

రైతులకు అందివచ్చిన అవకాశం...

'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగేళ్ల క్రితం సత్తుపల్లి, అశ్వరావు పేట సందర్శించినప్పుడు ఆయిల్ పామ్ సాగు చేస్తూ మంచి లాభాలు గడించడం నేను స్వయంగా చూశాను. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడం వల్ల గాలిలో తేమశాతం అధికంగా ఉండేది. అప్పుడే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని భావించాను. గాలిలో పొడి వాతావరణం ఉండడం వల్ల సాధ్యం కాలేదు. స్వరాష్ట్రం సిద్ధించాక జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. కాల్వలు, వాగులు, చెరువుల్లో వేసవిలోనూ నీరు ఉండడంతో గాలిలో తేమ శాతం పెరిగింది. సంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్ట పోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో వరిసాగు చేయలేని పరిస్థితి ఉంది. రైతులకు ఇది అందివచ్చిన అవకాశం ఆయిల్ ఫామ్ పంట సాగు. ప్రస్తుతం తెలంగాణలో పామాయిల్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉంది.'

-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి

విదేశాల నుంచి పామాయిల్ స్పౌట్స్...

Harish rao on oil farm cultivation: రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సిద్దిపేట జిల్లాలో 50,585 ఎకరాల్లో ఆయిల్ ఫామ్​ పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని అన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కల కొరత ఏర్పడడంతో మలేసియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు అధికారులను పంపి 40 వేల ఎకరాలకు సరిపడా పామాయిల్ స్పౌట్స్ తెప్పించామని చెప్పారు. అలాగే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రంగనాయక సాగర్ జలాశయం వద్ద 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ నర్సరీ కోసం పేర్కొన్నారు.

'ఆయిల్​పామ్ సాగుకు ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్లు క్రమం తప్పకుండా స్థిర ఆదాయం వస్తుంది. ఈ పంట సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఎకరానికి నికరంగా రూ.లక్షన్నర ఆదాయం వస్తుంది. గెలలో వచ్చే నూనె ఆధారంగా చెల్లింపులు చేస్తారు. సాగు చేసిన 4 ఏళ్ల తర్వాత పంట చేతికి రావడం ప్రారంభమవుతుంది. ప్రతి 15 రోజులకు గెల వస్తుంది. వరి, చెరుకు మినహా కాఫీ, కోక్, శాండల్ వుడ్, టేక్ సహా ఇతర అన్ని పంటలను పామాయిల్ సాగులో అంతర పంటలుగా సాగు చేయవచ్చు.'

-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి

వరి వంటి పంటలకు ఎకరానికి అందించే నీటితో... మెక్రో ఇరిగేషన్‌ పద్దతి ద్వారా కనీసం ఐదెకరాలలో పామాయిల్‌ సాగు చేయవచ్చని మంత్రి తెలిపారు. అంతేకాకుండా చీడపీడలు, దొంగతనం, అడవిజంతువులు, కోతుల బెడద వంటివి ఈ పంటకు ఉండవన్నారు.

ఇదీ చదవండి:KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.