సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు సమీపంలో 1.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ఎక్కడ త్రాగునీటి లీకేజీలు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.
మనిషికి 100 లీటర్లు స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రతినిత్యం సమయానికి ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆదివారం ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లాంగ్ షీట్ పంపిన తర్వాత ఉన్నతాధికారులను ఫీల్డ్ పైకి పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఫారూఖ్ హుస్సేన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.