ETV Bharat / state

Harish Rao: పంచాయతీ కార్యదర్శులకు స్కేల్ వేతనాలు: హరీశ్ రావు

గ్రామీణాభివృద్ధికి దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు అన్నారు. ఏ రాష్ట్రంలోనూ పల్లె, పట్టణ ప్రగతి పనులు అమలు కావడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ప్రజాప్రతినిధులు, అధికారులతో రేపటి నుంచి జరిగే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్ష జరిపారు.

Minister harish rao meeting with officers
ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Jun 30, 2021, 5:48 PM IST

జిల్లావ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుతున్నాయని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులపై అంశాల వారీగా ప్రాధాన్యత పనులు చేపట్టాలని అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన జరిగిన నాలుగో విడత పల్లె, పట్టణ ప్రగతి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు మాత్రమే కాదు

అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదని మంత్రి హరీశ్​ రావు అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కూడా అభివృద్ధిలో ఓ భాగమేనని.. నాలుగేళ్ల నుంచి డయేరియా లాంటి సీజనల్ వ్యాధులు లేవన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ముగిసిన పది రోజుల తర్వాత అధికారులతో సమీక్షలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలానికో ఓ బృహత్ పల్లె ప్రకృతి వనం పది రోజుల్లో ప్రారంభించాలని.. దీని కోసం ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు

రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 80 ట్రాక్టర్లు ఉండేవని.. కానీ ఇవాళ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 19, 298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెకు నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కలిసికట్టుగా పనిచేయాలి

అధికారులు, ప్రజాప్రతినిధులు తూతూమంత్రంగా పనిచేయకూడదని... యుద్ధ ప్రాతిపదికన పల్లె, పట్టణ ప్రగతి సాధనలో ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని వివరించారు. గ్రామ పంచాయతీలకు ప్రతినెల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈజీఎస్ కింద సిద్దిపేట జిల్లాలో రూ.28.32 కోట్ల బిల్లులకు వెంటనే ప్రతిపాదనలు పంపిస్తే రెండు రోజుల్లో చెల్లిస్తామన్నారు. పనుల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు కబురు అందించారు. వారికి స్కేల్ వేతనాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఏప్రిల్ మాసం నుంచి అమలవుతాయని మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్​ రావు, రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ హుస్సేన్, ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిలతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు

ఇదీ చూడండి: Telangana: రూ.1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.