ETV Bharat / state

ఎక్స్​ప్రెస్ బస్టాండ్​ పనులకు హరీశ్ రావు శంకుస్థాపన - harish inagarate rtc bus stand

సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.6 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు, ఎక్స్​ప్రెస్ బస్టాండు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పెరిగిన రద్దీ, అవసరాల దృష్ట్యా నూతన మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

minister Harish Rao, siddipet latest news
ఎక్స్​ప్రెస్ బస్టాండ్​ పనులకు హరీశ్ రావు శంకుస్థాపన
author img

By

Published : Apr 9, 2021, 2:18 PM IST

పెరిగిన రద్దీ, అవసరాల దృష్ట్యా నూతన మోడల్ బస్టాండ్ నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో రూ.6 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు, ఎక్స్​ప్రెస్ బస్టాండ్​ రోడ్డు పునరుద్ధరణ-రోడ్డు విస్తరణ పనులను... జిల్లా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలతో కలిసి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని లింగారెడ్డిపల్లిలో ఓపెన్ జిమ్​ను మంత్రి ప్రారంభించారు.

మూడు అంతస్తులతో నిర్మాణం

45 ఏళ్ల క్రితం అప్పటి రవాణా శాఖ మంత్రి చొక్కరావు పాత బస్ స్టేషన్​ను ప్రారంభించారని హరీశ్​రావు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట జనాభా 10 రెట్లు పెరిగిందన్నారు. ప్రతి రోజూ సుమారు 22 నుంచి 25 వేల మంది ప్రయాణీకులు ఈ బస్​స్టేషన్​కు వచ్చి వెళ్తున్నారని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మూడు అంతస్తులతో నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. సుమారు 15 వేల పైచిలుకు విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.

ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం

గతంలో సీఎం కేసీఆర్ ఆనాడు సిద్ధిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో ఎక్స్​ప్రెస్ బస్టాండ్ నిర్మించారని తెలిపారు. ఎక్స్​ప్రెస్ బస్టాండ్ వెనుక ఉన్న కాలనీలకు ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా.. రూ.12 లక్షల రోడ్డు విస్తరణ-వైడింగ్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎక్స్​ప్రెస్ బస్టాండ్​ హరిప్రియ నగర్, శ్రీనగర్ కాలనీ, ఆర్డీఓ క్యాంపు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం దారిలో.. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దిశగా ఆర్టీసీ నుంచి తీసుకున్న భూ సేకరణకై రూ.84 లక్షలు చెల్లింపులు చేసినట్లు వివరించారు.

ఆర్టీసీకి మూడు వేల కోట్లు

నూతన బస్టాండ్​ నిర్మిస్తున్న దృష్ట్యా ప్రజలకు ఉపయోగపడేలా ఇబ్బందులు లేకుండా.. తాత్కాలికంగా ఒక బస్​స్టాప్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. భాజపా అధికారంలోకి వచ్చాక 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందన్నారు. అందువల్ల ఆర్టీసీ మరింత నష్టాల్లోకి పోతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్​లో ఆర్టీసీకి మూడు వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. తెరాస ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతుందని హరీశ్​రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఏం రాజశేఖర్, ఆర్టీసీ ఛీప్ అడ్వైజర్​ రాంబాబు, డీఏం రాం మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అభిమానుల ఆగ్రహానికి థియేటర్​ ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.